యూపీలోని కాన్పూర్ లో మద్యం సేవించి వేదికపై నాగిన్ డ్యాన్స్ చేసిన వరుడితో పెళ్లి రద్దు చేసుకున్న వధువు సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి సమయంలో వరుడు మద్యం మత్తులో తూలుతూ స్టేజ్ ఎక్కి, నాగిన్ డ్యాన్స్ చేశాడు. వరుడి ప్రవర్తనతో విసిగిపోయిన వధువు, 'నేను మద్యానికి బానిసైన వాడిని పెళ్లి చేసుకోను' అని తేల్చి చెప్పి వెళ్లిపోయింది.