కట్నం అడిగాడని.. పెళ్లి రద్దు చేసుకున్న పెళ్లికూతురు

కట్నం అడిగిన వరుడితో వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలెక్కడానికి కొద్దిసేపటి ముందు వరుడు రూ.20 లక్షలు, బ్రెజా కారు అదనంగా కావాలని డిమాండ్ చేశాడు. తన తల్లిదండ్రులను గౌరవించని, డబ్బు పిశాచి అయిన వరుడితో జీవితం గడపలేనని, పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పింది. దీంతో చివరి నిమిషంలో వివాహం రద్దు చేసుకున్నారు.  ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్