పెళ్లి వేడుకలో వరుడి తల్లి ప్రేమతో తినిపించబోయిన రసగుల్లా కింద పడబోతుండగా, వధువు మెరుపు వేగంతో స్పందించి గాలిలోనే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వధువు చురుకుదనాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ, ఇది ఎంఎస్ ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాలను గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.