పెళ్ళైన మరుసటి రోజే అత్తగారింట్లో అడుగుపెట్టిన ఒక నవవధువు తన ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో వారందరూ కొత్త పెళ్లికూతురు పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆమె తన ప్రియుడిని రహస్యంగా ఇంటికి పిలిపించుకుంది. వారిద్దరినీ ఏకాంతంగా చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారిద్దరికీ దేహశుద్ది చేసి అమ్మాయిని ప్రియుడితో పంపారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.