పిచ్చోడంటూ పీటలపైనే తిట్టిన వధువు.. పెళ్లి క్యాన్సిల్

ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వ్యక్తికి కాన్పూర్‌కి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి ఊరేగింపు ఆలస్యంగా రావడం, బంధువులు తాగి ఉండటంతో గందరగోళం నెలకొంది. వరుడు పదేపదే వేడి నీళ్లు అడగడంతో పీటలపైనే వధువు అతన్ని 'పిచ్చోడు' అని తిట్టింది. దీంతో ఆగ్రహించిన వరుడి కుటుంబం, వధువు కుటుంబం మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. చివరికి ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకుని వెనుదిరిగాయి.

సంబంధిత పోస్ట్