పెళ్లికి 14 రోజుల ముందు యువతితో పారిపోయిన వధువు

పంజాబ్‌లోని మురాద్పురాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లఖ్వీందర్ కౌర్ అనే వధువు తన పెళ్లికి 14 రోజుల ముందు స్నేహితురాలితో పారిపోయింది. సదరు యువతికి, సమీప గ్రామానికి చెందిన యువకుడితో జనవరి 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమె, సునీత అనే యువతితో పారిపోయింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, స్వలింగ వివాహం చేసుకుంటామని సునీత తెలిపింది. ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్