ప్రియుడితో కలిసి ఉరివేసుకున్న వధువు!

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి కొద్ది గంటల ముందు వధువు సంధ్య తన ప్రియుడు శుభేంద్ర యాదవ్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యలు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారిద్దరి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గురువారం పెళ్లి జరగాల్సి ఉండగా యువతి మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్