తాళి కట్టే సమయంలో పెళ్లి నిరాకరించిన వధువు

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బిజినేపల్లి (M)కి చెందిన యువకుడితో లింగాల(M)కు చెందిన యువతికి రెండు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి పీటలపై తాళి కట్టే సమయంలో, తనకు పెళ్లి ఇష్టం లేదని వధువు తెగేసి చెప్పడంతో వరుడు, బంధువులు షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు. దీంతో వివాహం ఆగిపోయింది. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చులను అమ్మాయి తండ్రి భరించాలని పెద్దలు తీర్మానించారు.

సంబంధిత పోస్ట్