మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మండపంలో పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు వరుడిని వదిలి తన ప్రియుడికి దండ వేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. దీంతో వధువు తరపు వారు ఆమెను, ప్రియుడిని పట్టుకుని కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.