‘బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గిరీశ్ భరద్వాజ్ కన్నుమూత

దేశవ్యాప్తంగా 'బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత గిరీశ్ భరద్వాజ్(76) కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యలతో కర్ణాటకలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో వందలాది వంతెనలను నిర్మించి వేలాది మందికి రవాణా సౌకర్యం కల్పించిన ఆయన సేవలు విశేషంగా గుర్తింపు పొందాయి. గ్రామీణ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

సంబంధిత పోస్ట్