అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేసినప్పటికీ, పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్ స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యత అని, ఈ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ గగనతలాన్ని గానీ, సైన్యాన్ని గానీ ఈ యుద్ధం కోసం పంపబోమని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. స్పెయిన్ కూడా అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలోని బేస్‌లను వాడుకోకుండా నిషేధం విధించింది.