ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో 20వ పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మానుష్ షా-దియా చితాలే జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీఫైనల్లో చైనా జోడీ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, కాంస్యం దక్కించుకుంది. దీంతో భారత్ మొత్తం 20 పతకాలు (2 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు) సాధించి, పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. షూటింగ్లోనూ భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం సాధించింది.