ఈతకు వెళ్లి అక్కాతమ్ముడు మృతి!

TG: సిద్దిపేట(D) గజ్వేల్ (M)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. కొడకండ్ల గ్రామానికి చెందిన కుక్కల రిషిక (13), మనీష్ (12) అనే అక్కాతమ్ముళ్ల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు దినం కావడంతో రిషిక, మనీష్ కలిసి గ్రామ సమీపంలోని మల్లన్న సాగర్ కెనాల్ వద్దకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో నీటి లోతు తెలియక అందులో మునిగి చనిపోయారు. పిల్లలు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్