AP: బావమరిదిని బావ కత్తులతో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటు చేసుకుంది. బావమరిది హమీద్, బావ హనీఫ్‌కు మధ్య కొంతకాలంగా ఫంక్షన్ హాల్ నిర్వహణ విషయంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో హనీఫ్ కత్తులు పట్టుకుని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాడు. మరో వ్యక్తితో కలిసి అందరూ చూస్తుండగా హమీద్‌ను దారుణంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.