పంజాబ్‌లోని తార్న్ తారన్ బస్ స్టాండ్‌లో 20 ఏళ్ల జగ్‌జీత్ సింగ్ అనే యువకుడిని అతని బావమరుదులు పిడిబాకులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. నెల క్రితం ప్రేమవివాహం చేసుకున్న జగ్‌జీత్‌ను అత్త ఇంటికి పిలిపించి, ఈ దాడికి పాల్పడ్డారు. మృతుడి శరీరంపై 60కి పైగా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ పెళ్లే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.