ఇన్సూరెన్స్ డబ్బు కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం అన్న వెంకటేష్‌ను తన తమ్ముడు నరేష్ హత్యచేశాడు. అన్న పేరుపై రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నరేష్.. అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు నరేష్, స్నేహితుడు రాకేష్, డ్రైవర్ ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ఈ నిజాలు బయటపడటంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్