బ్రదర్‌.. మనిద్దరం కలిసి సినిమా చూద్దాం: సోనూసూద్‌

సోనూసూద్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫతేహ్‌’. జనవరి 10న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఫతేహ్‌’ కొత్త ట్రైలర్‌ను నటుడు మహేశ్ బాబు సోషల్‌ మీడియా లో రిలీజ్ చేసి సోనూసూద్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనిపై స్పందించిన సోనూసూద్‌ ‘లవ్‌ యూ బ్రదర్‌. మనిద్దరం కలిసి సినిమా చూద్దాం’ అని రిప్లై ఇచ్చారు. ‘అతడు’, ‘దూకుడు’ ‘ఆగడు’ చిత్రాల్లో మహేశ్‌బాబు, సోనూసూద్‌ కలిసి నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్