అన్న ప్రేమ వ్య‌వ‌హారం.. మ‌హిళా కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తులసిబాయి, తన అన్న రాజు నాయక్‌ ప్రేమ వ్యవహారంలో ఇరుక్కుని ఆత్మహత్య చేసుకుంది. రాజు నాయక్‌ మౌనిక అనే యువతిని ప్రేమించి, ఆమెతో దిగిన ఫోటోలను వైరల్ చేసి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ వ్యవహారంలో తులసిబాయి కూడా ఇరుక్కోవడంతో, ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక రాజుతో పాటు తులసిబాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్