రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

TG: హనుమకొండ జిల్లా ధర్మసాగర్(M) దేవనూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కారులోని మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులు జనగామ(D) తరిగొప్పుల(M) నర్సాపూర్‌కు చెందిన ఏనుగుల శివ, లోకేష్‌గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్