పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు

TG: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన కారును ధ్వంసం చేయడంతో మొదలైన వివాదం, ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ బాలకృష్ణ, తొగుట సీఐ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕