TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ భవన్ దగ్గరకు కవరేజీ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. లోపలికి రావొద్దు అంటూ పవన్‌పై కుర్చీతో దాడిచేశారు. ఈ క్రమంలో అతడి కెమెరా ధ్వంసం అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల కవరేజీకి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదంటూ ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.