దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆదివారం తన నివాసంలో డిండి మండలంలోని జేత్య తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు రామావత్ లచ్చిరామ్, మూడావత్ కర్ణాకర్ సహా 10 కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ప్రజలకు చేరువగా సేవలందించడమే ప్రభుత్వ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధత తమను ఆకట్టుకుందని, అందుకే పార్టీలో చేరామని కొత్తగా చేరినవారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.