TG: సిట్ దర్యాప్తు తీరు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, తెలంగాణ జాతిరత్నం కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఐక్యంగా ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.