TG: త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై BRS కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ భవన్లో మంగళవారం పార్టీ నేతలతో KTR హరీశ్రావు సమావేశం అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల మాజీ మంత్రులతో పలు కీలక విషయాలు చర్చించారు. ఎన్నికల సన్నద్ధతపై నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం చేశారు.