TG: పార్టీ మారే నేతలకే బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యమిస్తోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మేడ్చల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఇతర పార్టీలను విమర్శించడం మాని, ఓడిన పార్టీగా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గులాబీ జెండా మోసేవారికే సముచిత స్థానం కల్పించాలని, దీనిపై కేసీఆర్ స్పందించకపోతే బీఆర్ఎస్‌కు మళ్లీ షాక్ తప్పదని హెచ్చరించారు.