TG: నేతన్నల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. సంక్రాంతిలోగా వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలు చేయకుంటే 10 వేల మందితో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నాకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపినట్లు చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.