బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభ, ప్లీనరీని ఎండ తీవ్రత కారణంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో, ఈసారి పరిమిత సంఖ్యలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు.