పోరాటాలు చేసి ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్‌ఎస్‌: కేటీఆర్‌

అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అని, పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి, మళ్లీ బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పోరాటం చేస్తామని వెల్లడించారు. 14 ఏళ్లపాటు తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పార్టీ పునరంకితమవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్