TG: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. వాటాల పంపకాల్లో విభేదాల నుంచే కవిత కొత్త పార్టీ పుట్టిందన్నారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ నుంచి సమాధానం లేదన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఎన్ని రెండు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందముందని ఆరోపించారు. బీజేపీ-బీఆర్‌ఎస్ దోస్తీ వల్లే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగట్లేదని విమర్శించారు.