చిల్పూర్‌లో బీఆర్ఎస్‌ నేత ఆత్మహత్య

TG: జనగామ జిల్లా చిల్పూర్‌ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు నారబోయిన రవిచంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో ఉరేసుకుని రవిచంద్ర సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనతో చిల్పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕