తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘బీఆర్ఎస్ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నదమ్ముల్లాంటి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని తెలిపారు.