ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

TG: హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. మంత్రి పొంగులేటి ఆస్తులపై ఈడీ విచారణ జరపాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. గతంలో ఈడీ సోదాలు చేసి చర్యలు ఎందుకు తీసుకోలేదని నేతలు పశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్‌ రాజు, ఇతర నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు నేతలు ప్రయత్నం చేయగా, అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ BRS నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕