BRS నేతల నిరసనపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో BRS ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప కేటీఆర్, హరీశ్‌రావు వేసుకోలేదని విమర్శించారు. అందులోనూ వారి దొరతనం బయటపడిందని అని ఎద్దేవా చేశారు. 'నిరసనలో కూడా BRS నేతల్లో సమానత్వంలేదు. రైతులకు బేడీలు వేయడంపై BRS నేతలకు మాట్లాడే అర్హత లేదు. గతంలో వెల్‌లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారు.కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే కాలరాస్తున్నారు’ అని మండిపడ్డారు.