TG: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామస్తులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తుర్కపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.