బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి: మహేశ్ కుమార్ గౌడ్

TG: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచక పాలనపై విచారణలు జరుగుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరమని, కేటీఆర్, హరీశ్ రావు మాదిరిగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ రాజరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నిందలు వేయడం విచారకరమన్నారు.

సంబంధిత పోస్ట్