శాసన మండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు అక్రమ మైనింగ్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు సీఎం స్పష్టం చేశారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.