TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తనను కావాలని అడ్డుకున్నారని మంత్రికి వివరిస్తుండగా, కాంగ్రెస్ నేతలు వెనుక నుంచి కేకలు వేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి "బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా, జాగ్రత్తగా మాట్లాడండి" అని కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తాను వారి కంటే గట్టిగా మాట్లాడగలనని ఆయన స్పష్టం చేశారు.