TG: హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద బైఠాయించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ నుంచి గన్‌పార్క్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. తమకు సభలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సభాపతి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు చేశారు. సీఎంపై మాట్లాడితే మైక్ కట్ చేస్తామని స్పీకర్ అనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.