TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం కీలక నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఇవాళ కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.