నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,200 పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. ప్రతి పురపాలిక, నియోజకవర్గ కేంద్రాల్లో బైకు ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ సీనియర్‌ నేతలు పిలుపునిచ్చారు. 'ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసనలు ఉండాలి. పోలీసులతో ఘర్షణ వాతావరణానికి తావివ్వకూడదు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలి'  అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్