TG: రాష్ట్రంలో కరవు రావాలని BRS కోరుకుంటోందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, గడ్డం పెంచి పెద్ద మనిషి అయ్యానని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని, అయినా BRS దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.