సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే వివేకానంద

TG: పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. కోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటించి మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం ఆదేశాలను రేవంత్‌ ప్రభుత్వం గౌరవించాలని, తన పాలనపై నమ్మకముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్