TG: బీజేపీకి దగ్గరగా ఉన్న వాళ్లే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయట పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కే పరిమితమవుతుందన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీ అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు.