TG: మూడు రాష్ట్రాల్లో దోపిడీకి పాల్పడుతున్న బ్రూస్‌లీ గ్యాంగ్‌ను సికింద్రాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో బ్రూస్‌లీ గ్యాంగ్ సూత్రధారి హుబ్బళికి చెందిన నెహెమ్యా సహా ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారు. నెహెమ్యాపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి రూ.2.25 లక్షల నగదు, ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.