ఢిల్లీ ఘాజీపూర్‌లో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. బుధవారం రాత్రి వికాస్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న సమయంలో కారును ఓ బైకర్ ఢీకొట్టాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బైకర్ తన మిత్రులను పిలిపించి వికాస్, సుమిత్‌లపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. అనంతరం వికాస్‌ను కత్తులతో పొడిచి హత్య చేశారు. సుమిత్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.