హైదరాబాద్‌లోని టోలిచౌకి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పారామౌంట్ కాలనీలో ఇర్ఫాన్ (24) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్‌ని కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ సోదరుడు అద్నాన్‌కి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిలాల్ అద్నాన్‌ని పిలిచి మాట్లాడుతుండగా గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన ఇర్ఫాన్ పై బిలాల్ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఇర్ఫాన్‌ని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.