యూపీ హర్దోయి జిల్లా నెక్సరా కాలనీలో ఇంటి పనిమనిషి ఉపాసనను దొంగతనం అనుమానంతో యజమానురాలు ఆకాంక్ష, ఆమె కుటుంబ సభ్యులు కుర్చీకి కట్టేసి దారుణంగా కొట్టారు. చెప్పులు, చేతులతో కొడుతూ కర్రతో చితకబాదారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ బలవంతం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది, ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.