TG: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఆరేళ్ల మనీష్ అనే బాలుడి గొంతు కోసి గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడిన బాలుడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.