సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన తాజోద్దీన్(29) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగలు హత్య చేసి బావిలో పడేశారు. నాగులకట్ట మసీదు నుంచి తాజోద్దీన్‌ను శనివారం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ నేపథ్యంలో మృతదేహాం బావిలో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.