దారుణం… గొంతు కోసి మాజీ సర్పంచ్ హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ మన్బోధ్ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. భూమి, ఎన్నికల వివాదాలతో బాధపడుతున్న యాదవ్ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్